భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటారు అందరూ!!!
మన జీవితంలో “ప్రత్యక్షం అయ్యేవాళ్లలో”- కొంతమందిలో-“పరోక్షంగా” ప్రత్యక్షం అవుతాడు,అందుకనే “దైవం మానుష రూపేణా” అని అన్నారు.మనుషుల్లో
కనపడే దేవుణ్ణి చూడకలిగితే,ప్రత్యక్షంగా,పరోక్షంగాకూడా తారసపడుతుంటాడు ప్రయత్నం చెయ్యండి, తప్పక దర్శనంఇస్తాడు!
సాధారణంగా మనం ఊహించుకునే రూపాలతో ప్రత్యక్షం అయినా నమ్మని కలికాలం మనుషులమాయే!అందుకనే దేవుడు కూడా మన బుద్ధికి అర్ధం అవడం కోసం- మనుషుల్లో నివాసం ఉంటున్నాడు.మనమేమో ఆయన కోసం గుళ్ళు, గోపురాలు పట్టుకు తిరుగుతూ ఉంటాం అద్భుతం జరిగి ప్రత్యక్షమవుతాడాని-ఎలా అవుతుంది?
ఆయన నిజరూపాన్ని చూసి తట్టుకునే శక్తి మనకు వచ్చిన తక్షణమే ఆ దివ్యమంగళరూపాన్ని సాక్షాత్కరింప చేస్తాడు; ప్రయత్నలోపం మనదే, ఆయన సిద్ధమే ఎప్పుడూ తాను సృష్టించిన జీవుల్ని కలవడానికి-మన భాషలో చెప్పాలంటే 24/7- మనం ఆన్లైన్లో ఉంటామే అలాగన్నమాట!
మనం ఆన్లైన్లో ఉండటం కాదు, ఆయన ఆన్లైన్లో ఉంటాడు అని గ్రహించడం ముఖ్యం.ఇప్పుడు తత్వం బోధపడిందిగా, చూద్దాం ఏమాత్రం ప్రయత్నం చేస్తారో-నేను అనుకోవడం లేడు, ఆయన అనుకుంటాడు అని చెప్తున్నా!
ఇదంతా బాగానే ఉందిగానీ, ఈ రోజుల్లో ప్రజలు ఆయన ప్రత్యక్షం అవ్వాలని కోరడంలేదట, వాళ్ళు కోరిన కోర్కెలు ఎప్పుడూ తీరుస్తూ ఉంటే చాలుట, ఏదో “పోయినసారి కలిసినప్పుడు నాచెవిలో మెల్లిగా చెప్పినట్టు గుర్తు”.ఇది “ఆయన మాట బాబూ, నా కల్పితం అనుకునేరు”.
అయినా ఏదో వెధవ జంఝాటం గానీ నాకెందుకు మీగురించి- నా సంగతి నేను చూసుకోక!